పోలవరం సందర్శన యాత్రలో విషాదం | Man Died With Heart Attack In Polavaram Project Visiting Tour | Sakshi
Sakshi News home page

Jan 27 2019 4:27 PM | Updated on Jan 27 2019 4:29 PM

Man Died With Heart Attack In Polavaram Project Visiting Tour - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం సందర్శన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. పోలవరం సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. అతన్ని ప్రకాశం జిల్లా పెద్ద అంబడిపూడి గ్రామానికి చెందిన కురపాటి సుబ్బారావు(65)గా గుర్తించారు. పోలవరం సందర్శన పేరుతో ప్రభుత్వం వివిధ జిల్లాల నుంచి ప్రజలను ఆర్టీసీ బస్సుల్లో అక్కడికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వం ప్రకాశం జిల్లా నుంచి ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో సుబ్బారావు ఈ రోజు ఉదయం పోలవరానికి చేరుకున్నారు.

ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి పట్టిసీమరేవు వద్దకు వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోలియారు. సుబ్బారావును ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అక్కడున్నవారు ప్రయత్నించినప్పటికి ఆ దగ్గర్లో ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో ఆయన మృతిచెందారు. ఈ విషయాన్ని గుట్టచప్పుడు కాకుండా ఉంచిన అధికారులు.. సుబ్బారావు మృతదేహాన్ని తిరిగి అదే బస్సులో స్వగ్రామానికి తరలించారు. జిల్లాల వారిగా టార్గెట్లు పెట్లి మరి.. ప్రచార యావతో వేలాది మందిని పోలవరం సందర్శనకు తరిలిస్తున్న ప్రభుత్వం.. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement