భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యాయత్నం | Man Attempts Suicide In RAYACHOTI | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యాయత్నం

Oct 28 2018 11:29 AM | Updated on Oct 28 2018 11:29 AM

Man Attempts Suicide In RAYACHOTI - Sakshi

రాయచోటి టౌన్‌ : రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్‌ కాలనీలో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రాలేదని నీళ్ల ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నాడు.  పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కిందకు దింపి అతని ప్రాణాలను కాపాడారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నమండె మండలం గుడిబండ గ్రామానికి చెందిన గణేష్‌ భార్య భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చేసింది. కాపురానికి రావడానికి భార్య నిరాకరించడంతో చేసేది లేక శనివారం రాత్రి  సుమారు 100 అడుగుల ఎత్తు ఉన్న నీటి ట్యాంక్‌ ఎక్కాడు. భార్య కాపురానికి రాకపోతే పైనుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకొంటానని బెదిరించారు. ఈ విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్‌ సీఐ చంద్రశేఖర్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నాడు. ఎంతో నేర్పుతో అతడికి నచ్చజెప్పి కిందకు దించారు. తరువాత భార్య భర్తలిద్దరికి సర్దిచెప్పి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement