‘ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ లేదు’ | MP Mithun Reddy Lashes Out Against Attack On Dasaratharami Reddy, Watch Full Video For More Details | Sakshi
Sakshi News home page

‘ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ లేదు’

May 3 2026 5:52 PM | Updated on May 3 2026 6:07 PM

YSRCP MP Mithunreddy Takes On AP Govt

రాయచోటి: పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ నేత దశరథరామిరెడ్డిపై దాడి జరిగిందని, ఇది ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ లేదనడానికి నిదర్శమన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి. నిన్న దశరధరామిరెడ్డికి తనపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారని, నిన్నే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు దాడి జరిగేది కాదన్నారు. 

కూటమి నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని, ఇప్పటివరకూ ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి 40 స్టేషన్లలో తిప్పుతున్నారని, మరి ఇప్పుడు కళ్ల ముందే టీడీపీ మూకలు రెచ్చిపోయి ఒక వైఎస్సార్‌సీపీ నేతపై దాడి చేస్తే పోలీసులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement