వేటకొడవళ్లతో దాడి: ఇద్దరికి తీవ్రగాయాలు | Man attacks with sickle | Sakshi
Sakshi News home page

వేటకొడవళ్లతో దాడి: ఇద్దరికి తీవ్రగాయాలు

Jan 9 2016 3:32 PM | Updated on Oct 9 2018 5:39 PM

అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్ మండలంలోని కేతిరెడ్డి కాలనీలో బాషా అనే వ్యక్తి వేటకొడవళ్లతో దాడిచేయగా మౌలాలి, షఫీ అనే ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

ధర్మవరం రూరల్ (అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్ మండలంలోని కేతిరెడ్డి కాలనీలో బాషా అనే వ్యక్తి వేటకొడవళ్లతో దాడిచేయగా మౌలాలి, షఫీ అనే ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బాషా అనే వ్యక్తి తన చెల్లెలి కోసం కేతిరెడ్డి కాలనీలో ఇందిరమ్మ ఇల్లు కట్టించాడు. అయితే బావ మౌలాలి, ఆయన సోదరుడు షఫీతో గొడవ పడిన బాషా తన ఇల్లు తనకు ఇచ్చేయమని శనివారం మధ్యాహ్నం గొడవపడ్డాడు. ఆగ్రహించిన బాషా వేటకొడవళ్లతో ఇద్దరిపై దాడి చేసి నరికాడు. ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement