లోక కల్యాణం కోసమే మహాకుంభాభిషేకం | Maha Kumbhabhishekam At Visakha Sri Sharada Peetham | Sakshi
Sakshi News home page

లోక కల్యాణం కోసమే మహాకుంభాభిషేకం

Feb 12 2019 2:41 AM | Updated on Feb 12 2019 2:42 AM

Maha Kumbhabhishekam At Visakha Sri Sharada Peetham - Sakshi

కిలో స్వర్ణ కిరీటాన్ని స్వామీజీకి అందజేస్తున్న  మర్రిరెడ్డి రామకృష్ణారెడ్డి దంపతులు 

పెందుర్తి :  లోక కల్యాణం కోసం నిరంతరం విశాఖ శ్రీశారదాపీఠం పాటుపడుతోందని, అందులో భాగంగా పీఠంలో అష్టబంధన మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ చెప్పారు. దేశం, రాష్ట్రానికి అమ్మవారి కరుణ, కటాక్షం ఉండాలన్నది పీఠం ఆకాంక్ష అన్నారు. పీఠం వార్షిక వేడుకల్లో భాగంగా రెండో రోజు సోమవారం అష్టబంధన మహాకుంభాభిషేకం వేడుకగా నిర్వహించారు. స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలని ప్రకృతీష్టి జరిపామని వెల్లడించారు. పీఠం గుంటూరు జిల్లా కన్వీనర్, విరంచి ఫ్యాషన్స్‌ అధినేత మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, మృదుల దంపతులు కిలో స్వర్ణ కిరీటాన్ని స్వామీజీ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించారు. కళాతపస్వి ఐ.వి.ఎన్‌ శాస్త్రిని సంగీత శాస్త్ర విశారద బిరుదుతో స్వామీజీ సత్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement