రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య | Lovers Committed Suicide On Railway Track in Chittoor District | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

Apr 20 2014 9:28 AM | Updated on May 10 2018 12:34 PM

చంద్రగిరి మండలం పాణపాకంలో ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

చంద్రగిరి మండలం పాణపాకం సమీపంలో ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైలు పట్టాలపై పడి ఉన్న ప్రేమ జంట మృతదేహలను చూసి రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు.

 

పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు గడ్డం వారి పల్లెకు చెందిన యువకుడు కాగా, యువతి పూతలపట్టు మండలం మోటకం వారి పల్లెకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. మృతల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement