నూకాంభికాను దర్శించుకున్న లోక్సభ స్పీకర్ | Lok sabha speaker sumitra mahajan visits Nookambika Ammavari Temple in anakapalle | Sakshi
Sakshi News home page

నూకాంభికాను దర్శించుకున్న లోక్సభ స్పీకర్

Apr 9 2015 1:11 PM | Updated on Mar 9 2019 3:08 PM

నూకాంభికాను దర్శించుకున్న లోక్సభ స్పీకర్ - Sakshi

నూకాంభికాను దర్శించుకున్న లోక్సభ స్పీకర్

లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం విశాఖ జిల్లా కసింకోట మండలంలో పర్యటించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో పాల్గొనేందుకు...

విశాఖ :  లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం విశాఖ జిల్లా కసింకోట మండలంలో  పర్యటించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కసింకోట మండలం లల్లపాలెంలో సంసాద్ ఆదర్శ్ గ్రామయోజన కార్యక్రమాన్ని సుమిత్రా మహాజన్ ప్రారంభించారు.

భారతదేశాన్ని ప్రపంచంలోనే శ్రేష్టమైన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆమె ఈ సందర్భంగా అన్నారు. గ్రామాల అభివృద్ధిలో, స్వచ్ఛ భారత్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సుమిత్రా మహాజన్ పిలుపునిచ్చారు. అనంతరం ఆమె అనకాపల్లిలో నూకాంభికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement