మైనింగ్ విభాగంలో అవినీతికి తావు లేకుండా చూడాలని, అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వారి లెసైన్స్‌లు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని భూగర్భ, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి పీతల సుజాత అధికారులను ఆదేశించారు.
గుంటూరు వెస్ట్ : మైనింగ్ విభాగంలో అవినీతికి తావు లేకుండా చూడాలని, అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వారి లెసైన్స్‌లు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని భూగర్భ, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి పీతల సుజాత అధికారులను ఆదేశించారు. గురువారం గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో మహిళా, శిశు సంక్షేమ, భూగర్భ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించి ప్రసంగించారు. మైనింగ్ విభాగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ఆవిధంగా వచ్చిన ఆదాయంతో పేదల సంక్షేమానికి ఖర్చు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆమె కోరారు. అవసరమైతే అటువంటి వారి లెసైన్స్‌లు రద్దు చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ సెంటర్ల పనితీరు మెరుగుపడాలని, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందజేయాలని కోరారు.
వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కాలం పూర్తయిన మైనింగ్ లీజ్‌లను గుర్తించి వాటిని పునరుద్ధరించాలని, పునరుద్ధరించని వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, గనుల శాఖ డెరైక్టర్ సుశీల్‌కుమార్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు ఉషాకుమారి తదితరులు పాల్గొన్నారు.