సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన | left parties strike on coruuption sez land | Sakshi
Sakshi News home page

సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన

Aug 13 2015 1:20 PM | Updated on Sep 22 2018 8:31 PM

సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన - Sakshi

సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన

అనంతపురం జిల్లా తుంగోడు సెజ్ భూముల నష్టపరిహారం చెల్లింపులో అధికారులు రూ.2 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని..

పెనుకొండ (అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా తుంగోడు సెజ్ భూముల నష్టపరిహారం చెల్లింపులో అధికారులు రూ.2 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం నేతలు, సమాచార హక్కు ఐక్యవేదిక నేతలు, సీపీఐ, సీపీఎం నేతలు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని సోమందేపల్లి ఎంపీడీవో కార్యాలయంవద్ద ధర్నా చేశారు. రైతులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలను అధికారులు స్వాహా చేశారని, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement