రాజధాని నిర్మాణం పేరుతో దోపిడి | Land scam in tdp | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణం పేరుతో దోపిడి

Mar 5 2016 3:23 AM | Updated on Sep 3 2017 7:00 PM

రాజధాని నిర్మాణం పేరుతో దోపిడి

రాజధాని నిర్మాణం పేరుతో దోపిడి

రాజధాని నిర్మాణం పేరుతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల భూములను కారుచౌకగా బినామీ పేర్లతో కొనుగోలు .....

ఎమ్మెల్యే వై. ఐజయ్య

పగిడ్యాల: రాజధాని నిర్మాణం పేరుతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల భూములను కారుచౌకగా బినామీ పేర్లతో కొనుగోలు చేసి రాష్ట్రాన్ని దోపిడి  చేస్తున్నారని  నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య విమర్శించారు.శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ కుంభకోణానికి పాల్పడిన అవినీతి మంత్రులను ప్రశ్నించకుండా నిజాలను వెలుగులోకి తెచ్చిన సాక్షిపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీని వీడిని తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడుతుందన్నారు.

వారిని అనర్హులుగా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌కు పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరుతామన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రమాదేవి, డీలర్ నారాయణ, దేవన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement