త్వరలో అన్ని విషయాలు చెబుతా: లడగపాటి | Lagadapati Rajagopal Visit Tirumala | Sakshi
Sakshi News home page

త్వరలో అన్ని విషయాలు చెబుతా: లడగపాటి

Apr 8 2019 1:47 PM | Updated on Apr 8 2019 1:47 PM

Lagadapati Rajagopal Visit Tirumala - Sakshi

తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదు. త్వరలో అన్ని విషయాలు చెబుతా.

సాక్షి, తిరుమల: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సోమవారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కాలినడకన కొండెక్కి స్వామి ఆశీస్సులు పొందారు. దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాలినడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలందరు ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పారు.

ఎన్నికల గురించి విలేకరులు ప్రశ్నించగా.. పవిత్రమైన తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదని, త్వరలో అన్ని విషయాలు చెబుతానని అన్నారు. కాగా, గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు తప్పడంతో ఆయన తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement