మానవత్వం మరచిన వేళ..

Kurnool Doctors Negligence on Injured Patient - Sakshi

తలకు తీవ్రగాయాలైన వ్యక్తిని నేలపై పడుకోబెట్టిన నంద్యాల ప్రభుత్వాసుపత్రి సిబ్బంది

కర్నూలు, బొమ్మలసత్రం: తలకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఐసీయూలో చికిత్స చేయకుండా కింద పడుకోబెట్టిన ఘటన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బనగానపల్లె పాతబస్టాండ్‌ సమీపంలో శనివారం తలకు గాయాలై ఓ వ్యక్తి పడి ఉండడాన్ని చూసిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న విశయాన్ని గుర్తించిన 108 సిబ్బంది నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రి సిబ్బంది బాధితుడిని ఐసీయూలోకి తీసుకెళ్లి నేలపై పడుకోబెట్టారు. కనీసం సరైన చికిత్స కూడా అందించలేదు. వార్డులో మంచాలు ఖాళీగా ఉన్నా.. బాధితుడిని కింద పడుకోబెట్టడమే గాక, మెరుగైన చికిత్స అందించకుండా వదిలేసిన ఆసుపత్రి సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి వెంట ఎవరూ లేరు అని తెలిసి కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటం పలు విమర్శలకు దారి తీస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top