‘జెండాలు పక్కన పెట్టి.. ఏకైక ఎజెండాతో పోరాడాలి’

konathala ramakrishna protest by candles on bjp government - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ కోసం మార్చి 4న(ఆదివారం) విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సాయంత్రం 6గంటలకు కొవ్వొత్తులతో తెలిపే నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నాలని మాజీ పార్లమెంట్‌ సభ్యులు, ఉత్తరాంధ్ర చర్చవేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భరంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలు  నాలుగేళ్లు గడుస్తున్నఅమలుకు నోచుకోని విషయం మనందరీకి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని హక్కులు కానీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2014లో రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి ఆచరణలో లేవన్నారు.

మనకు ఇచ్చిన హామీలపై నిర్ధిష్టమైన కార్యచరణతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలా లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్‌ శాశ్వతంగా నష్టపోతుందని కొణతాల పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఎక్కవగా నష్టపోతారన్నారు. ఈ తరుణంలో జెండాలు పక్కనపెట్టి, ఏకైక ఎజెండాతో సమిష్టిగా పోరాడని పక్షంలో భావితరాలు మనల్ని క్షమించవు అని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాలు, స్వఛ్చంధ సంస్థలు, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కవులు, కళాకారులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, మేధావులు, న్యాయవాదులందరూ పాల్గొన్నాలని కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు.


Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top