
కేసుల నుంచి బయటపడేందుకు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నానా తిప్పలు పడుతున్నారు.
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన ఇంటికి తరలించుకున్న వ్యవహారంలో కేసుల నుంచి బయటపడేందుకు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నానా తిప్పలు పడుతున్నారు. ఇందులో భాగంగా హైకోర్టును ఆశ్రయించారు. ఫర్నిచర్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఇచ్చేస్తానని, వాటిని తీసుకెళ్లేలా అసెంబ్లీ అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ ఫర్నిచర్ తీసుకెళ్లకపోతే, వాటి వ్యయాన్ని చెల్లిస్తానంటూ ఆయన కోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యంపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.