ముఖ్యమంత్రి తప్పులను లెక్కిస్తున్నాం : మధుయాష్కీ | Kiran Kumar Reddy mistakes being counted: Madhu Yashky | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి తప్పులను లెక్కిస్తున్నాం:మధుయాష్కీ

Nov 5 2013 1:37 PM | Updated on Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి  తప్పులను లెక్కిస్తున్నాం : మధుయాష్కీ - Sakshi

ముఖ్యమంత్రి తప్పులను లెక్కిస్తున్నాం : మధుయాష్కీ

శిశుపాలుడిలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న తప్పులను లెక్కిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ చెప్పారు.

హైదరాబాద్: శిశుపాలుడిలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న తప్పులను లెక్కిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ చెప్పారు.  టీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు.   విభజనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అడ్డుకుంటారంటూ సీమాంధ్ర నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

 విభజన ప్రక్రియ రాజ్యాంగ నిబంధనల మేరకు జరుగుతోందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో ఆగదన్నారు. ఇతర పార్టీలేవీ సహకరించకపోయినా వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్న గట్టి నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. వచ్చే జనవరి నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని మధుయాష్కీ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement