కజికిస్థాన్‌ అమ్మాయి.. విజయవాడ అబ్బాయి

kazakhstan Woman Indian Man Marriage In Vijayawada - Sakshi

వివాహంతో ఒక్కటైన ప్రేమజంట

సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్‌) : వారిద్దరు వేర్వేరు దేశాలకు చెందిన వారు.. అయితేనేం వారిని ప్రేమ ఒకటిగా చేసింది. కజికిస్థాన్‌కు చెందిన అమ్మాయి.. విజయవాడకు చెందిన అబ్బాయి బంధువుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం  ఆది వారం ఒక్కటయ్యారు. నగరంలోని విజయకృష్ణా సూపర్‌ మార్కెట్‌ సమీపంలోని కల్యాణ మండపంలో వీరి వివాహం కనులపండువగా జరిగింది.

విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన ఆలపాటి వెంకటదుర్గా ప్రసాద్‌ రెండేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం కజికిస్థాన్‌ దేశంలోని షింకెన్ట్‌ పట్టణానికి వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో డెప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే కంపెనీలో షింకెన్ట్‌ పట్టణానికి చెందిన యుస్పోవ్‌ షుక్రత్, దిల్పుజా దంపతుల కుమార్తె సాహిస్త హెచ్‌ఎస్సీ అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వహిస్తోంది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. కజికిస్థాన్‌లో నిశ్చితార్థాన్ని జరిపించారు. ఆదివారం విజయవాడలో వివాహం చేసుకున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top