జూడాలను పరోక్షంగా హెచ్చరించిన మంత్రి | Kamineni Srinivas takes on junior doctors | Sakshi
Sakshi News home page

జూడాలను పరోక్షంగా హెచ్చరించిన మంత్రి

Nov 27 2014 1:06 PM | Updated on Aug 18 2018 8:10 PM

చేపట్టిన సమ్మె వెంటనే విరమించాలని జూనియర్ డాక్టర్ల (జూడాలు)కు ఆంధప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సూచించారు.

విజయవాడ: చేపట్టిన సమ్మె వెంటనే విరమించాలని జూనియర్ డాక్టర్ల (జూడాలు)కు ఆంధప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సూచించారు. లేకుంటే తెలంగాణలో మాదిరిగా హైకోర్టు తీర్పును బట్టి ఏపీలో కూడా చర్యలు తీసుకుంటామని ఆయన జూడాలను పరోక్షంగా హెచ్చరించారు. అయితే జూడాలు గురువారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏలూరు రోడ్డులోని రమేష్ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో జూడాలు చేపట్టిన సమ్మె గురువారం ఆరో రోజుకు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement