'పట్టిసీమ పేరుతో పోలవరం వివాదాస్పదం చేశారు' | K Ramakrishna takes on chandrababu | Sakshi
Sakshi News home page

'పట్టిసీమ పేరుతో పోలవరం వివాదాస్పదం చేశారు'

Apr 18 2015 4:09 PM | Updated on Aug 13 2018 4:30 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం అనంతపురంలో మండిపడ్డారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శనివారం అనంతపురంలో మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిందని ఆయన ఆరోపించారు. పట్టిసీమ పేరుతో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు వివాదాస్పదం చేశారని విమర్శించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.... ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హంద్రీ - నీవా ప్రాజెక్టుకు తక్షణమే రూ. 1800 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement