మీడియాతో ఆనందాన్ని పంచుకున్న జ్యోతి తల్లి

Jyothi Mother Pramila Said Thanks To CM Jagan Over Her Daughter Return To India - Sakshi

సాక్షి, నంద్యాల : కరోనా వైరస్‌ కారణంగా చైనాలో చిక్కుకున్న  జ్యోతి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో ఆమె తల్లి ముఖంలో ఆనందం విరబూసింది. భారత వైమానిక దళం గురువారం ప్రత్యేక విమానంలో చైనా నుంచి 112 మందిని  ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో కర్నూలు వాసి అన్నెం జ్యోతి ఒకరు. కూతురు క్షేమంగా తిరిగి రావడంతో జ్యోతి తల్లి ప్రమీల తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. కూతురు తమ చెంతకు చేరేందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మనందరెడ్డికి,  అధికారులకు, మీడియాకు ప్రమీల ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఢిల్లీ నుంచి తమ కూతురిని త్వరగా పంపిస్తే అనుకున్న సమయానికి జ్యోతి వివాహం జరిపిస్తామని విజ్ఞప్తి చేశారు. (ఎట్టకేలకు భారత్‌ చేరుకున్న జ్యోతి)

చదవండి: కేంద్ర మంత్రిని కలవనున్న జ్యోతి కుటుంబ సభ్యులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top