హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ప్రమాణం  | Justice Rakesh Kumar sworn in as High Court judge | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ప్రమాణం 

Nov 9 2019 5:36 AM | Updated on Nov 9 2019 5:36 AM

Justice Rakesh Kumar sworn in as High Court judge - Sakshi

జస్టిస్‌ రాకేష్‌కుమార్‌తో ప్రమాణం చేయిస్తున్న జస్టిస్‌ జితేంద్రకుమార్‌

సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ శుక్రవారం ప్రమాణం చేశారు. ఆయనతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌మహేశ్వరి ప్రమాణం చేయించారు. అంతకుముందు జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఇన్‌చార్జి) రాజశేఖర్‌ చదివి వినిపించారు.

హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జస్టిస్‌ మహేశ్వరితో కలిసి కేసులను విచారించారు. జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ రాకతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 15కు చేరింది.  

Advertisement
 
Advertisement
Advertisement