రేపే ‘జగనన్న చేదోడు’ పథకం ప్రారంభం | Jagananna Chedodu Scheme Launched On 10th June | Sakshi
Sakshi News home page

రేపే ‘జగనన్న చేదోడు’ పథకం ప్రారంభం

Published Tue, Jun 9 2020 6:48 PM | Last Updated on Tue, Jun 9 2020 7:34 PM

Jagananna Chedodu Scheme Launched On 10th June - Sakshi

సాక్షి, అమరావతి : నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కరోనా కష్టకాలంలోనూ ప్రతీ కుటుంబానికి అండగా నిలబడుతూ ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ) అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ‘జగనన్న చేదోడు’  పేరుతో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది. బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు జగనన్న పథకానికి రూ.154 కోట్ల 31 లక్షలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి : సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ)

ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు. షాపులున్న1,25,926 మంది టైలర్లకు రూ. 125,92,60, 82,347 మంది రజకులకు రూ. 82,34,70, 38,767 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 38,76,70 మొత్తం 2,47,040 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఈ లబ్దిదారులు వారి వృత్తికి అవసరమగు చేతి పనిముట్లు, చేతి పెట్టుబడి కోసం ఈ ఆర్దిక సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement