ఇది మరో కుట్ర : ఏపి మంత్రి రావెల | It's a conspiracy: Ravela Kishor Babu | Sakshi
Sakshi News home page

ఇది మరో కుట్ర : ఏపి మంత్రి రావెల

Jun 25 2014 5:33 PM | Updated on Aug 15 2018 9:20 PM

రావెల కిషోర్ బాబు - Sakshi

రావెల కిషోర్ బాబు

విద్యార్థుల స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం అని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు.

హైదరాబాద్: విద్యార్థుల స్థానికతపై   తెలంగాణ ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం అని  ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ప్రసిడెన్షియల్ ఆర్డర్‌ను కాదని తండ్రి స్థానికత అనడం సమంజసం కాదని పేర్కొన్నారు.

అధికారం కోసం విద్వేషాలను రెచ్చగొట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ మరో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదాన్ని తీసుకొస్తున్నారని విమర్శించారు. గవర్నర్ కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థలుకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement