వెంకన్న సేవలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ | ISRO chairman Radhakrishnans Tirumala visit | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్

Nov 6 2013 10:49 AM | Updated on Sep 2 2017 12:20 AM

వెంకన్న సేవలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్

వెంకన్న సేవలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్

’మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రయోగంలో తొలి దశ విజయవంతం కావటంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుపతి : 'మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రయోగంలో తొలి దశ విజయవంతం కావటంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో రాధాకృష్ణన్ దంపతులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు...వారికి రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం సందర్భంగా రాధాకృష్ణన్ నిన్న కూడా వెంకన్న దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement