తిరుమలలో జన సైనికుల ఓవరాక్షన్‌ | Overreaction of Janasena Supporters Before Tirupati Temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో జన సైనికుల ఓవరాక్షన్‌

Jun 13 2026 9:10 PM | Updated on Jun 13 2026 9:11 PM

Overreaction of Janasena Supporters Before Tirupati Temple

తిరుమల: తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు జన సైనికులు ఓవరాక్షన్‌ చేశారు. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రదర్శన చేసి హంగామా సృష్టించారు. పవన్‌ కళ్యాణ్‌ అనే నేను పుస్తకాన్ని శ్రీవారి ఆలయం ముందు ప్రదర్శించారు. ఆలయం ముందు పుస్తకాన్ని వీడియోలు తీశారు జనసేన నేతలు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

తిరుమలలో రాజకీయ ప్రచారంపై నిషేధం ఉన్నా ఉల్లంఘనలకు తెరలేపారు జనసేన నేతలు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విదంగా చేసిన జనసేన వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా సిబ్బంది ఉన్నా ఈ ఘటన ఎలా జరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఈ  ఉల్లంఘన ఎపిసోడ్‌తో తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యంపై చర్చ నడుస్తోంది.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement