అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం | Invitation for international conference | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం

Aug 28 2013 5:56 AM | Updated on Sep 1 2017 10:12 PM

అమెరికాలోని అట్లాంటాలో జరిగే ‘గ్లోబల్ ఇంటర్నేషనల్ ఎన్నారై వీఏ కన్వెన్షన్-2013

మహబూబాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : స్వచ్ఛంద, సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఎన్నారై వాసవీ అసోసియేషన్ అంతర్జాతీయ కమిటీ మహబూబాబాద్‌కు చెందిన వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్(మల్టీపుల) మాలె యోగీశ్వర్‌రావుకు ఆహ్వానం పంపింది. ఎన్నారై వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో జరిగే ‘గ్లోబల్ ఇంటర్నేషనల్ ఎన్నారై వీఏ కన్వెన్షన్-2013 అంతర్జాతీయ సదస్సు’కు ఆయన వెళ్లనున్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు అట్లాంటాలో సదస్సు జరగనుంది. కాగా, అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు అవకాశం రా వడం పట్ల యోగీశ్వర్‌రావు సంతో షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ ఆహ్వానం తనకెంతో దోహదపడుతుందని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement