అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ | Interstate gang of robbers busted in chittoor district | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Jul 13 2016 6:35 PM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాగుట్టును చిత్తూరు పోలీసులు రట్టు చేశారు.

చిత్తూరు : తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాగుట్టును చిత్తూరు పోలీసులు రట్టు చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement