ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య | Inter student suicide | Sakshi
Sakshi News home page

ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Apr 6 2014 2:42 AM | Updated on Nov 9 2018 5:02 PM

ఇంటర్మీడియెట్ పరీక్షలు సరిగ్గా రాయలేకపోయానని ఆందోళన చెందిన ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు సరిగ్గా రాయలేకపోయానని ఆందోళన చెందిన ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నంద్యాలలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  నంద్యాల పట్టణ శివారులోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కిరాణం వ్యాపారి లక్ష్మీనారాయణ కుమారుడు జయచంద్ర సాయివిష్ణు స్థానిక శ్రీనివాసనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు.

 

2013లో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో ఫెయిల్ అయిన మూడు సబ్జెక్టులు రాశాడు. అయితే మళ్లీ ఫెయిల్ అవుతానేమోనని మనస్థాపం చెందాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వారు ఉండగా సాయివిష్ణు తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement