సాక్షి,నంద్యాల: తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నంద్యాల సమీపంలోని హైవేపై ప్రయాణిస్తున్న బస్సు టైరు పేలడంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.


