
చంద్రబాబు నాయుడు
పారిశ్రామికవేత్తల చూపు ఏపీవైపే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
తిరుపతి: పారిశ్రామికవేత్తల చూపు ఏపీవైపే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తలతో ఆయన ఈరోజు ఇక్కడ సమావేశమయ్యారు. 2050 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. అన్ని వనరులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిబాటలో పయనిస్తామన్నారు.
పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఏపీ అభివృద్ధి చెందిందని, ఆ తరువాత టీడీపీ పాలనలోనే అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఏడు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి నీళ్లను కృష్ణానదికి తెచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇక్రిశాట్ ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధిపరుస్తామని చెప్పారు. హంద్రీనివా, గాలేరు-నగరి, స్వర్ణముఖి, సోమశిలలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు.
**