భారతదేశ పర్యటన మరువలేనిది | india tour never be forgetable | Sakshi
Sakshi News home page

భారతదేశ పర్యటన మరువలేనిది

Feb 22 2014 4:23 AM | Updated on Apr 4 2019 3:25 PM

ఇండియా పర్యటన ఎంతో మధురానుభూతిని ఇచ్చిందని అమెరికా, ఈజిప్ట్ దేశాలకు చెందిన పర్యాటకులు కొనియాడారు.

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: ఇండియా పర్యటన ఎంతో మధురానుభూతిని ఇచ్చిందని అమెరికా, ఈజిప్ట్ దేశాలకు చెందిన పర్యాటకులు కొనియాడారు. శుక్రవారం వారు పోచంపల్లిని సందర్శించారు. స్థానిక చేనేత సహకార సంఘం, దుకాణాలు, చేనేత గృహాలను సందర్శించి వస్త్రాలు, ఇక్కడి ప్రజల జీవన విధానాలపై అధ్యయనం చేశారు.
 
 పట్టుచీర కట్టుకుని, బొట్టుపెట్టుకుని అలరించారు. ముంబై, తిరువనంతపురం, హైదరాబాద్‌లోని ఆయుర్వేద కేం ద్రాలు, చరిత్రక ప్రదేశాలు, ఆశ్రమాలను సందర్శించి ప్రజల జీవనశైలి, ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేశామని అమెరికాకు చెందిన బాలరీ లిబీ అన్నారు. ఇండియాలో ఉన్న అద్భుతమైన ప్రదేశాలను మరెక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఈ బృందంలో ఈజిప్ట్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక అక్భార్ జర్నలిస్ట్ ఆహ్మద్‌నాశి, జాన్‌బిప్లర్ ఉన్నారు. వీరికి కేరళకు చెందిన స్నేహితుడు నవీన్‌రాజ్ మార్గదర్శకం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement