వెంకటాద్రిలో పొగలు | IN venkatadri express fumes | Sakshi
Sakshi News home page

వెంకటాద్రిలో పొగలు

Feb 21 2014 3:05 AM | Updated on Apr 7 2019 3:24 PM

కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్(12797)రైలులో గురువారం పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

రాజంపేట, న్యూస్‌లైన్ : కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్(12797)రైలులో గురువారం పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అలాగే  బ్రేక్‌బైడింగ్‌తో హస్తవరం రైల్వేస్టేషన్‌లో  అరగంట పాటు నిలిచిపోయింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు రాజంపేట-నందలూరు మధ్య ఉన్న హస్తవరం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత ఎస్-1బోగీకి సంబంధించి వీల్ వద్ద బ్రేక్‌బ్లాక్ జామ్ అయింది.
 
  పాస్‌త్రూలో వెళుతున్న రైలులో స్వల్పంగా మంటలు రావడంతో స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న  సిబ్బంది గమనించారు. వెంటనే డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో నిలిపివేశారు. బ్రేక్‌బైడింగ్‌లో సాంకేతికలోపం  తలెత్తడంతో  రైలు వేగం కూడా తగ్గిపోయింది. వెంటనే అప్రమత్తమైన రైలు రన్నింగ్‌స్టాప్ ఎస్-1బోగీ వద్దకు చేరుకొని బ్రేక్‌రిలీజ్ చేశారు. అనంతరం రైలుకు క్లియరెన్స్  ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement