బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి | IIIT Student Gandhi died in Basara | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి

Mar 11 2014 8:28 AM | Updated on Sep 2 2017 4:35 AM

ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థి నాగరాజు ఆత్మహత్య ఘటన మరువక ముందే ఆ కళాశాలలో మరో విషాదం చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి స్థానిక ట్రిపుల్ ఐటీ విద్యార్థి గాంధీ మరణించారు. చిత్తురు జిల్లాకు చెందిన గాంధీ ట్రిపుల్ ఐటీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్వస్థలం నుంచి గాంధీ రైల్లో వస్తు ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడు. దాంతో గాంధీ అక్కడికక్కడే మరణించారు. రైల్వే స్టేషన్ అధికారులు వెంటనే స్పందించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

 

దాంతో గాంధీ మృతదేహన్ని ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థి మృతి వార్త తెలియడం బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి కె.నాగరాజు కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement