ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారం కౌన్సెలింగ్ | IIIT counselling starts at july 3rd week, says Ganta Srinivas Rao | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారం కౌన్సెలింగ్

Jul 1 2015 11:37 AM | Updated on Mar 23 2019 8:59 PM

ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారం కౌన్సెలింగ్ - Sakshi

ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారం కౌన్సెలింగ్

వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెడతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

హైదరాబాద్: వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెడతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో గంటా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జులై మూడోవారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1230, కడప ట్రిపుల్ ఐటీలో 770 సీట్లు భర్తీ చేస్తామని చెప్పారు. అయితే అవకాశం దక్కనివారి కోసం అదనంగా 224 సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. సౌకర్యాలు, ఫ్యాకల్టీ పూర్తిస్థాయిలో లేనందున ట్రిపుల్ ఐటీలో సీట్ల సంఖ్యను పెంచలేదని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement