కడపలో భారీ చోరీ | Huge robbery at kadapa | Sakshi
Sakshi News home page

కడపలో భారీ చోరీ

Jun 11 2015 10:07 PM | Updated on Mar 28 2019 4:53 PM

కడపలో భారీ చోరీ - Sakshi

కడపలో భారీ చోరీ

పట్టణంలో జరిగిన భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి..

కడప: పట్టణంలో జరిగిన భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి 12 తులాల బంగారం కిలో వెండి రూ. 70 వేల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన టూటౌన్ పరిధిలోని అగాడీ వీధిలోని అన్వర్ హుస్సేన్ ఇంట్లో జరిగింది. హజ్‌యాత్ర కోసం భార్యతో కలిసి వెళ్లిన అన్వర్ హుస్సేన్ కూతుర్ని కాస్త ఇంటివైపు చూస్తూ ఉండమని చెప్పి వెళ్లారు.

ఈ క్రమంలో ఆయన కూతురు గురువారం సాయంత్రం వెళ్లి చూడగా.. తాళం పగల కొట్టి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. ఇంట్లో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, కేజీ వెండి నగలతో పాటు రూ. 70 వేల నగదు, 60 చీరలు ఎత్తుకెళ్లినట్లు ఆమె తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement