breaking news
hazz tour
-
టీమిండియాతో టీ20, వన్డే సిరీస్.. ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ దూరం..!
టీమిండియాతో స్వదేశంలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ దూరమయ్యాడు. ఆదిల్ రషీద్ హజ్ యాత్ర నిమిత్తం ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్.. ఇదే కారణంతో టోర్నీ అఖరి మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టులో రషీద్ భాగంగా ఉన్నాడు. అయితే తాను చాలా కాలం నుంచి తీర్థయాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నట్లు రషీద్ తెలిపాడు. జూన్ 25న మిడిల్ ఈస్ట్‌కు వెళ్లేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు,యార్క్‌షైర్‌లు తనకు సెలవు మంజూరు చేసినట్లు రషీద్ చెప్పాడు. "నేను చాలా రోజుల నుంచి హజ్ యాత్రకు వెళ్లాలి అనుకుంటున్నాను. బీజీబీజీ షెడ్యూల్ వల్ల సమయం దొరకలేదు. నేను ఈ విషయం గురించి ఈసీబీ, యార్క్‌షైర్‌తో మాట్లాడాను. వారు అర్ధం చేసుకుని నాకు అనుమతి ఇచ్చారు" అని రషీద్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 7న సౌతాంప్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: ENG vs NZ: దురదృష్టమంటే నికోల్స్‌దే.. ఇలా కూడా ఔట్ అవ్వొచ్చా..! -
కడపలో భారీ చోరీ
కడప: పట్టణంలో జరిగిన భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి 12 తులాల బంగారం కిలో వెండి రూ. 70 వేల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన టూటౌన్ పరిధిలోని అగాడీ వీధిలోని అన్వర్ హుస్సేన్ ఇంట్లో జరిగింది. హజ్‌యాత్ర కోసం భార్యతో కలిసి వెళ్లిన అన్వర్ హుస్సేన్ కూతుర్ని కాస్త ఇంటివైపు చూస్తూ ఉండమని చెప్పి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన కూతురు గురువారం సాయంత్రం వెళ్లి చూడగా.. తాళం పగల కొట్టి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. ఇంట్లో ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, కేజీ వెండి నగలతో పాటు రూ. 70 వేల నగదు, 60 చీరలు ఎత్తుకెళ్లినట్లు ఆమె తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.