ఆసుపత్రి ఎదుట ఆందోళన | hospital doctors due to negligence of the person | Sakshi
Sakshi News home page

ఆసుపత్రి ఎదుట ఆందోళన

Feb 24 2015 11:42 AM | Updated on Sep 2 2017 9:51 PM

కర్నూలు జిల్లాలోని బనగానపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు.

కర్నూలు :  కర్నూలు జిల్లాలోని బనగానపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుని బంధువులు  వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. వివరాలు...సుబ్రహ్మణ్యం (45) అనే వ్యక్తి అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూమంగళవారం మృతి చెందాడు.

  దీంతో వైఎస్ఆర్ సపీ నేత కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో మృతుడి బంధువులు మంగళవారం ఉదయం ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. సేవల్లో నిర్లక్ష్యంపై కాటసాని రామిరెడ్డి వైద్యులను నిలదీశారు.

Advertisement
 
Advertisement
Advertisement