ఉన్నత విద్యా మండళ్ల భేటీలో సభ్యుల వాగ్వాదం | Higher Education Councils meeting of the members of the argumentation | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యా మండళ్ల భేటీలో సభ్యుల వాగ్వాదం

Oct 10 2014 1:21 AM | Updated on Sep 2 2017 2:35 PM

ఏపీ, తెలంగాణ ఉన్నత విద్యామండళ్ల చైర్మన్ల తొలి భేటీ ఆసాంతం వాడివేడిగా సాగింది.

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ఉన్నత విద్యామండళ్ల చైర్మన్ల తొలి భేటీ ఆసాంతం వాడివేడిగా సాగింది. పలు అంశాలపై ఇరు మండళ్ల చైర్మన్లు, సభ్యు లు సహా వాగ్వివాదానికి దిగారు. ఏపీ మండలి తీరుపై తెలంగాణ మండలి తీవ్ర వేదన, నిరసన వ్యక్తం చేసింది. అయితే, తమ తీరు బాగానే ఉందని పరిధి లోబడే వ్యవహరిస్తున్నామని ఏపీ మండలి చైర్మన్ సర్దిచెప్పే యత్నం చేశారు. ఇరు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లూ పలు కీలక సమస్యలపై చర్చించినా.. అంతిమంగా నిర్ణయం తీసుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వాలే కనుక ఆయా సమస్యలకు ఎలాంటి పరిష్కారాలను చూపలేక పోయాయి. ఇరు మండళ్ల చైర్మన్లు ప్రొఫెసర్ ఎల్. వేణుగోపాలరెడ్డి(ఏపీ), ప్రొఫెసర్ పి. పాపిరెడ్డి(తెలంగాణ), వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ విజయప్రకాశ్, ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ వెంకటాచలం, కార్యదర్శులు కె. సతీష్‌రెడ్డి, శ్రీనివాసరావు, ఏపీ మండలి డెప్యూటీ డైరక్టర్ కృష్ణమూర్తి, డెప్యూటీ సెక్రటరీ సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

► ఏపీ మండలి తీరుపై తెలంగాణ మండలి ఉపాధ్యక్షుడు మల్లేశం నిరసన వ్యక్తం చేశారు. ‘ఏపీ ఉన్నత విద్యామండలి ఆధిపత్య ధోరణితో వెళ్తోంది. తెలంగాణ ప్రభుత్వం తనకు సొంతంగా ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేసినా ప్రభుత్వ సంస్థ అని కూడా చూడకుండా ఏపీ మండలి ఇష్టానుసారం వ్యవహరించడం సబబా?’ అని మండిపడ్డారు. ఏపీ మండలి సభ్యులు పెద్ద మనసుతో వ్యవహరించడం లేదని తెలంగాణ మండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు.

► పెద్దమనసుతోనే ఉన్నందునే టి.చైర్మన్‌ను సాదరంగా ఆహ్వానించామని ఏపీ మండలి వైస్ చైర్మన్ విజయప్రకాశ్, డెప్యుటీ డైరక్టర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు.

► తమ పరిధి కాకపోయినా కార్యాలయంలో తెలంగాణ మండలి చైర్మన్‌కు, ఇతర ముఖ్యులకు చాంబర్లు కేటాయించేలా చేశామని, చైర్మన్‌కు కారు, అటెండర్లను ఇచ్చామని తెలిపారు. నిధులు, సిబ్బంది, భవనాలు, వాహనాలు తదితర అంశాలపై ఇరు మండళ్ల సభ్యులు చర్చించారు.

► మండలి కార్యకలాపాలకోసం రూ.2 కోట్లు కావాలని ప్రతిపాదనలు పం పినా ఏపీ అధికారులు పట్టించుకోలేదని తెలంగాణ మండలి సభ్యులు ఆరోపిం చారు. సదరు ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, నిధులు అత్యవసరమైన పక్షంలో మరో రూపంలో సమీకరించుకోవాలని ఏపీ మండలి చెప్పింది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement