వరద నీటిలో చంద్రబాబు హెలీప్యాడ్‌

Helipad Area Is Full Of Water In Chandrababu Naidu House Amaravati - Sakshi

చంద్రబాబు నివాసంలోకి చేరిన వరద నీరు

నీట మునిగిన వాక్‌వే, రివర్‌ ఫ్రంట్‌ వ్యూ 

సాక్షి, అమరావతి: ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. కృష్ణానదీ తీరానా ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్రమ కట్టడ నివాసం వద్ద పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. దీంతో నివాసంలోని గార్డెన్‌, బయట ఉన్న హెలీప్యాడ్‌ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 ట్రక్కుల చిప్స్, ఇసుక బస్తాలను వేస్తున్నారు. అయినా వరద ఉధృతిని అవి కూడా ఆపలేకపోతున్నాయి. రివర్‌ ఫ్రంట్‌ వ్యూ భవనం, వాక్‌వే ఇప్పటికే నీట మునిగాయి. ఆయన నివాసాన్ని వరద నీరు పూర్తి స్థాయిలో చుట్టుముట్టుతోంది. శనివారం సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో నివాసంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారుల హెచ్చరించారు.

చంద్రబాబు నివాసంలోని పంటపొల్లలోకి కూడా వరద నీరు భారీగా చేరుతోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు హై సెక్యూరిటీ జోన్‌లోని తన ఇంటిపై డ్రోన్‌లతో నిఘా వేశారంటూ చంద్రబాబు ట్వీట్‌లపై ట్వీట్‌లు చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నది గర్భంలో, కరకట్టపై నిర్మించిన అక్రమ భవనాల్లోకి ప్రవహాం కొనసాగుతోంది. ఇదిలావుండగా.. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలు ముంపు బారిన పడకుండా రక్షించేందుకు కృష్ణా నదిపై జలవనరుల శాఖ డ్రోన్‌లను మోహరించింది. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top