శ్రీశైలానికి పెరుగుతున్న వరద ఉధృతి | Heavy water flow in Srisailam dam | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి పెరుగుతున్న వరద ఉధృతి

Sep 12 2015 7:41 PM | Updated on Sep 3 2017 9:16 AM

శ్రీశైల జలాశయానికి రోజు రోజుకు వరద ఉధృతి పెరుగుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయానికి రోజు రోజుకు వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు 5 టీఎంసీల నీరు జలాశయానికి వచ్చి చేరింది. జూరాల, తుంగభద్ర, హంద్రీల నుంచి 62,566 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.

వరద ప్రవాహం ప్రారంభమయ్యేనాటికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 801.90 అడుగులుగా ఉంది. శనివారం సాయంత్రం సమయానికి డ్యాం నీటిమట్టం 822.30 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 42.6064 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement