కోస్తాకు ఉరుములు, వడగళ్ల వానలు | heavy rains andra prdesh | Sakshi
Sakshi News home page

కోస్తాకు ఉరుములు, వడగళ్ల వానలు

May 10 2016 8:43 PM | Updated on Jun 2 2018 3:08 PM

ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వచ్చే రెండు రోజులు ఉరుములో కూడిన జల్లులు, వడగళ్ల వర్షం కురుస్తుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది.

హైదరాబాద్: ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వచ్చే రెండు రోజులు ఉరుములో కూడిన జల్లులు, వడగళ్ల వర్షం కురుస్తుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల బుధ, గురు వారాల్లో కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా , గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు, జల్లులు, వడగళ్ల వానలు కురుస్తాయని మంగళవారం ఐఎండీ వెబ్‌సైట్‌లో హెచ్చరించింది. రాయలసీమకు వర్షాల హెచ్చరికలు చేయపోయినా ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement