తిరుమలలో కుంభవృష్టి | heavy rain in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కుంభవృష్టి

May 18 2015 1:00 AM | Updated on Sep 3 2017 2:14 AM

తిరుమలలో కుంభవృష్టి

తిరుమలలో కుంభవృష్టి

తిరుమలలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడి, ఆలయం వద్దనీరు నిలిచింది.

తిరుమల: తిరుమలలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడి, ఆలయం వద్దనీరు నిలిచింది. వర్షంలో భక్తుల అవస్థలు పడ్డారు. రెండో ఘాట్‌రోడ్డులో చివరి 5 మలుపుల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఘాట్‌రోడ్డు సిబ్బంది వెంటనే వాటిని తొలగించారు.  

శ్రీవారి సర్వదర్శనం క్యూలో తోపులాట: తిరుమలలో ఆదివారం సర్వ దర్శనం క్యూలో తోపులాట చోటుచేసుకుంది. చిన్నారులు, వృద్ధులు క్యూలో నలిగిపోయారు. ఇక్కడి సిబ్బందిలో సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణమని భక్తులు విమర్శిస్తున్నారు.

రికార్డు స్థాయిలో దర్శనం:  శనివారం రికార్డు స్థాయిలో 90వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం సర్వ దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు బయట కిలోమీటరు వరకు క్యూ కట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement