మంత్రాలయం మండల పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది.
కర్నూలు (మంత్రాలయం) : మంత్రాలయం మండల పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి సమీపంలోని నల్లవాగు పొంగిపొర్లుతోంది. దురదృష్టవశాత్తూ ఎనిమిది మంది మహిళలు, ఓ పురుషుడు నల్లవాగులో చిక్కుకుపోయారు. విషయం తెలిసిన పట్టణ సీఐ ప్రత్యేక పుట్టీలను తెప్పించి వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.