హెల్దీ బేబీస్‌.. | Healthy Babies Competitions In Prakasam | Sakshi
Sakshi News home page

హెల్దీ బేబీస్‌..

Jul 3 2018 1:23 PM | Updated on Jul 3 2018 1:23 PM

Healthy Babies Competitions In Prakasam - Sakshi

ఫిమేల్‌ విభాగం విజేత చేత్రప్రియ, మేల్‌ విభాగం విజేత శ్రావణ్‌ కుమార్‌

ఉలవపాడు: ఉలవపాడులోని ప్రభుత్వ వైద్యశాలలో చిన్నపిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఆఫ్‌ ఉలవపాడు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఏడాది లోపు వయసున్న పిల్లలకు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆరోగ్య పోటీలు నిర్వహించగా 110 మంది పాల్గొన్నారు. పీడియాట్రిక్‌ వైద్యుడు సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలను సోమవారం ప్రకటించారు. బేబీ ఆఫ్‌ ఉలవపాడు మేల్‌ విభాగంలో దామతోటి శ్రావణ్‌ కుమార్, ఫిమేల్‌  విభాగంలో పల్లకి చేత్రప్రియ విజేతలుగా నిలిచారు. వైద్యశాల సూపరింటెండెంట్‌ శోభారాణి, బ్రహ్మయ్య  బహుమతులు అందజేశారు. వీరితో పాటు మరో 11 మంది పిల్లలకు బహుమతులిచ్చారు. టీకాలు వేస్తున్న సమయం, బరువు, తల్లితండ్రుల ఆరోగ్య సూచనలు, పిల్లల ఆరోగ్యం ఆధారంగా విజేతలను ఎంపిక చేసినట్లు వైద్యులు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న పిల్లలందరికీ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కరీమ్‌.. విటమిన్‌ డ్రాప్స్‌ అందజేశారు. కార్యక్రమంలో దంతæ వైద్యులు సురేష్, యూనియన్‌ నాయకులు అల్తాఫ్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement