జిల్లాలోని పలు పోస్టాఫీసుల్లో ప్రజలకు ‘మీ సేవ’ ద్వారా సేవలు అందిస్తున్నట్లు హన్మకొండ పో స్టల్ సూపరింటెండెంట్ బీవీ.సత్యనారాయణ....
ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు పోస్టాఫీసుల్లో ప్రజలకు ‘మీ సేవ’ ద్వారా సేవలు అందిస్తున్నట్లు హన్మకొండ పో స్టల్ సూపరింటెండెంట్ బీవీ.సత్యనారాయణ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వంతో తపాలశాఖ ఒప్పందం చేసుకుందని ఆయన చెప్పారు. మొదటి విడతలో జిల్లాలోని జనగామ, పరకాల ప్రధాన తపాల కార్యాలయాల్లో మీ సేవలు ప్రారంభమయ్యాయన్నారు.
రెవెన్యూ, రిజి స్ట్రేషన్, స్టాంపులు, మునిసిపాలిటీ, పోలీసు, ఆ ధా ర్, రవాణ, సివిల్ సప్లై, విద్య, వ్యవసాయం, సాం ఘిక సంక్షేమ శాఖలకు సంబంధించిన వివిధ రకాల సేవలను తపాలశాఖలో ఏర్పాటు చేసిన మీ సేవ ద్వారా పొందవచ్చని తెలిపారు. హన్మకొండ తపాల డివిజన్‌లోని అన్ని ప్రధాన, ఉప తపాల కార్యాల యాల ద్వారా ఇన్‌స్టంట్ మనీఆర్డర్ సర్వీస్ అందుబాటులో ఉందని, ఈ సర్వీస్ ద్వారా సొమ్ము ను బదిలీ చేసుకోవచ్చని చెప్పారు. మనీ ఆర్డర్ ఇచ్చి న రోజునే సీక్రెట్ కోడ్ తెలిపి అదే రోజు సొమ్ము పొం దవచ్చని ప్రజలకు సూచించారు.
తపాలశాఖలో మొబైల్ మనీ ట్రాన్స్‌ఫర్ పథకం కూడా అందుబాటులో ఉందని, ఈ పథకం ద్వారా వేరొకరు పం పిన సొమ్మును పొందేందుకు సంబంధిత వ్యక్తికి వ చ్చిన సంక్షిప్త సమాచారాన్ని చూపాలన్నారు. అలాగే తిరుమల దేవస్థానానికి చందా పంపిన భక్తుల చిరునామాకు స్వామివారి అక్షింతలు, ఫొటోను పోస్టు ద్వా రా అందించనున్నుట్లు ఆయన పేర్కొన్నారు,