పోలిట్బ్యూరో సమావేశం నుంచి వెళ్లిపోయిన హరికృష్ణ | Harikrishna in Rajya Sabha Ticket race | Sakshi
Sakshi News home page

పోలిట్బ్యూరో సమావేశం నుంచి వెళ్లిపోయిన హరికృష్ణ

Jan 27 2014 7:29 PM | Updated on Aug 29 2018 1:13 PM

నందమూరి హరికృష్ణ - Sakshi

నందమూరి హరికృష్ణ

టిడిపి పోలిట్బ్యూరో సమావేశం నుంచి ఆ పార్టీ మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ బయటకు వెళ్లిపోయారు.

హైదరాబాద్: టిడిపి పోలిట్బ్యూరో సమావేశం నుంచి ఆ పార్టీ మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ బయటకు వెళ్లిపోయారు. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు  ఆ పార్టీ పోలిట్బ్యూరో ఈ రోజు సమావేశమైంది.  తాను రాజ్యసభ టిక్కెట్ రేసులో ఉన్నట్లు హరికృష్ణ తెలిపారు.  తాను టిక్కెట్ ఆశిస్తున్నందున సమావేశంలో ఉండటం మంచిదికాదని బయటకు వచ్చినట్లు చెప్పారు.

సమైక్య రాష్ట్రం కోసమే రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసినట్లు హరికృష్ణ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement