breaking news
Rajya Sabha Ticket
-
నన్నే కాదంటారా.. కడప రెడ్డెమ్మ భర్త తిరుగుబాటు
-
కోటి రూపాయల ఆఫర్! : మాయావతి సంచలన ఆరోపణలు
లక్నో: మరోసారి రాజ్యసభకు పంపిస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తానని సొంత పార్టీ ఎంపీనే తనకు ఆఫర్ ఇచ్చారని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)అధినేత్రి మాయావతి బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అఖిలేశ్ దాస్ చేసిన ఈ ప్రతిపాదనను తాను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లు ఆమె చెప్పారు. వంద కాదు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినా టికెట్ ఇచ్చేది లేదని అతనికి తేల్చిచెప్పినట్లు తెలిపారు. లక్నో మాజీ మేయర్‌గా కూడా చేసిన అఖిలేశ్ దాస్ 2008లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఎస్పీలో చేరారు. రెండు రోజుల క్రితమే అతనిని బీఎస్పీ నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా, ఈ నెల 20న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ తరపు అభ్యర్థులుగా వీర్‌సింగ్, రాజారాంలను మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్పీకి ఉన్న సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే వారిద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ** -
పోలిట్‌బ్యూరో సమావేశం నుంచి వెళ్లిపోయిన హరికృష్ణ
హైదరాబాద్: టిడిపి పోలిట్‌బ్యూరో సమావేశం నుంచి ఆ పార్టీ మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ బయటకు వెళ్లిపోయారు. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆ పార్టీ పోలిట్‌బ్యూరో ఈ రోజు సమావేశమైంది. తాను రాజ్యసభ టిక్కెట్ రేసులో ఉన్నట్లు హరికృష్ణ తెలిపారు. తాను టిక్కెట్ ఆశిస్తున్నందున సమావేశంలో ఉండటం మంచిదికాదని బయటకు వచ్చినట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రం కోసమే రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసినట్లు హరికృష్ణ చెప్పారు.


