పరిటాల సునీత సోదరుడు వర్సెస్‌ మాజీ సర్పంచ్‌ | Groupism In TDP Leaders Anantapur | Sakshi
Sakshi News home page

పరిటాల సునీత సోదరుడు వర్సెస్‌ మాజీ సర్పంచ్‌

Dec 2 2018 9:17 AM | Updated on Dec 2 2018 10:59 AM

Groupism In TDP Leaders Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత సోదరుడికి టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌కు విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పరిటాల సునీత సోదరుడు మురళి తమపై ఆధిపత్యం చెలాయించడంపై మరూరు టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ బోయ వెంకటేష్‌ మండిపడ్డారు. తనపై కావాలనే కక్ష్య కట్టాడని బోయ వెంకటేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంత్రి అండదండలు చూసుకుని తనకు వచ్చిన కాంట్రాక్టు పనులను మురళి రద్దు చేయించారని ఆరోపించారు. జిల్లాలో బీసీల ఎదుగుదలను పరిటాల కుటుంబం ఓర్వలేకపోతుందని విమర్శించాడు. తాను ఇన్ని రోజులుగా టీడీపీలో పని చేసినందుకు సిగ్గుపడుతున్నానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement