గవర్నర్‌కు సీఎం జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు | Governor Biswabhusan Harichandan Birthday Celebrations | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు సీఎం జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

Aug 3 2019 10:03 AM | Updated on Aug 3 2019 3:16 PM

Governor Biswabhusan Harichandan Birthday Celebrations - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో కలకాలం ఆయురాగ్యోలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. గవర్నర్‌ హరిచందన్‌ తన 85 పుట్టినరోజు వేడుకలను గిరిజన, దళిత చిన్నారులతో జరుపుకున్నారు. పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గమ్మ దేవస్థానం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు.

అనంతరం గిరిజన, దళిత బాలబాలికల సమక్షంలో కేక్ కట్‌ చేసి నిర్వహించి, చిన్నారులకు నూతన వస్త్రాలు, నోట్ పుస్తకాలు అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని పెంపొందించే కూచిపూడి ప్రదర్శనతో సహా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్‌కు మంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కొడాలి నాని, పేర్పి నాని, వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement