మున్సిపల్ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం

గవర్నర్ నరసింహన్ - Sakshi


హైదరాబాద్: ప్రభుత్వం ఖరారు చేసిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. ఈ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది.  రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు  ప్రభుత్వం అందజేస్తుంది.



ఎన్నికలు జరగాల్సిన కార్పొరేషన్లు 10 ఉన్నాయి. వాటిలో  ఎస్టీ -1, ఎస్సీ -2, బీసీ -6, మహిళలు -5, రిజర్వు కానివి -5 ఉన్నాయి. మున్సిపాలిటీలను ఎస్టీ -4, ఎస్సీ -20, బీసీ -53, మహిళలు -41, రిజర్వు కానివి -41గా నిర్ణయించారు.


రిజర్వేషన్ల వివరాలు:



ఖమ్మం - ఎస్టీ (జనరల్)

రామగుండం - ఎస్సీ (జనరల్)

ఒంగోలు - ఎస్సీ (మహిళా)

ఏలూరు, కర్నూలు, చిత్తూరు - బీసీ (మహిళ)

జిహెచ్ఎంసి, కడప, నెల్లూరు -  బీసీ (జనరల్)

కాకినాడ, రాజమండ్రి, నిజామాబాద్, అనంతపురం, తిరుపతి - (జనరల్ - మహిళ)

గుంటూరు, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్ - (అన్ రిజర్వ్‌డ్)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top