డీఎస్సీ–18 అభ్యర్థులకు శుభవార్త

Good News For DSC-18 Candidates - Sakshi

రేపటి నుంచి నియామక ప్రక్రియ

ఆన్‌లైన్‌లోనే పోస్టింగు ఉత్తర్వులు

సెప్టెంబర్‌కల్లా 642 మందికి పోస్టింగులు

సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ 2018కి సంబంధించి నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుండడంతో కొత్తగా ఎంపిక కాబోతున్న ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నెల 20 నుంచి విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రారంభమై సెప్టెంబర్‌ 4 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. విశాఖ జిల్లాకు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ వెరసి 642 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తొలుత సెలెక్టయిన అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. వీటిని విద్యాశాఖ అధికారులు డౌన్‌లోడ్‌ చేసి వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సరైనవో కాదో పరిశీలిస్తారు. ఈనెల 27 నుంచి సర్టిఫికెట్లను పరిశీలించే పనిని జిల్లాలో ప్రారంభిస్తారు. అనంతరం ఆయా అభ్యర్థులు ఏ రోజున హాజరు కావాలో వారి మొబైల్‌ ఫోన్లకు సమాచారం పంపుతారు.

స్కూల్‌ అసిస్టెంట్లకు విశాఖ నగరం గురుద్వారా సమీపంలోని వసంతబాల విద్యావిహార్‌ పాఠశాలలో ఎంపిక ప్రక్రియను చేపడతారు. తుది ఎంపిక జాబితా అనంతరం స్కూలు ప్రాంతాల ఎంపిక వె»Œబ్‌ ఆప్షన్లతో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సరికొత్తగా ఆన్‌లైన్‌లోనే పోస్టింగు ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే తెలుగు భాషా పండితులు, హిందీ భాషా పండితులు, స్కూల్‌ అసిస్టెంటు తెలుగు, హిందీ, పీఈటీ పోస్టులు (ఐదు కేటగిరీలు) మిగిలిన అన్ని కేటగిరీల పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టులు ఖాళీగా ఉండిపోయిన పక్షంలో జాబితాలో తదుపరి మెరిట్‌ అభ్యర్థులకు అవకాశం ఇస్తారు. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న డీఎస్సీ అభ్యర్థులు నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా ఆభర్థులు సంబర పడుతున్నారు.

 
కేటగిరీ వారిగా చూస్తే ఎస్జీటీ పోస్టులు మైదానంలో 294, ఏజెన్సీలో 153 ఖాళీలు భర్తీ కానున్నాయి. జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 63 ఉన్నాయి. వాటిలో నాన్‌ ల్యాంగ్వేజీలతో పాటు పీఈటీ, మ్యూజిక్‌ ఉపా«ధ్యాయ ఖాళీలున్నాయి. ఇందులో మైదాన ప్రాంతంలో 56 కాగా, మిగిలిన 7 పోస్టులు ఏజెన్సీలో భర్తీ కానున్నాయి. మైదానంలో.. ఐదు గణితం ఉపాధ్యాయ పోస్టులు, బయాలాజికల్‌ సైన్స్‌కు 9, సాంఘికశాస్త్రం 13, సంగీతం 3,  పీఈటీలు 20, లాంగ్వేజిలు 6తో పాటు మరికొన్ని పోస్టులకు నియామకాలు జరగనున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top